ఏపీలో 71 కేసులు..ఒక్క కర్నూలులో 43
BY Telugu Gateway30 April 2020 11:25 AM IST

X
Telugu Gateway30 April 2020 11:25 AM IST
ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403 కు పెరిగింది. గత 24 గంటల్లో 71 కేసులు రాగా..ఒక్క కర్నూలు జిల్లాలో 43 కేసులు నమోదు కావటం విశేషం. కృష్ణా జిల్లాలో 10, అనంతపురంలో 3, చిత్తూరులో 3, తూర్పు గోదావరి 2, గుంటూరులో 4, కడపలో 4, నెల్లూరులో 2 కేసులు నమోదు అయ్యాయి.
ఇప్పటికే 321 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1051గా ఉన్నాయి. కొత్తగా రాష్ట్రంలో ఎలాంటి మరణాలు లేవని హెల్త్ బులెటిన్ లో తెలిపారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 6497 శాంపిళ్లను పరీక్షించారు.
Next Story