ఏపీ కొత్త ఎస్ఈసీగా కనగరాజు

రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారంలో ఏపీ సర్కారు యమా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటోంది. ఆర్డినెన్స్ తీసుకొచ్చి ప్రస్తుతం ఎస్ఈసీ రమేష్ కుమార్ ను తప్పించిన సర్కారు..కొత్త ఎస్ఈసీగా రిటైర్డ్ జడ్జి కనగరాజును నియమించింది. ఈ మేరకు ఆయన శనివారం నాడు బాధ్యతలు కూడా స్వీకరించారు. కనగరాజు మద్రాస్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు. వివిధ కమిషన్లలో సభ్యుడిగా వ్యవహరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక అర్హత నిబంధనలను మారుస్తూ గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్ ను గెజిట్‌లో ప్రభుత్వం ప్రచురించిన సంగతి తెలిసిందే.
. హైకోర్టు న్యాయమూర్తి స్థాయి అధికారిని నియమించడం, కాలపరిమితి మూడేళ్లకు కుదిస్తూ ఇచ్చిన ఆర్డినెన్స్ ను గెజిట్‌లో ప్రభుత్వం పేర్కొన్నది. కొత్త నియామానికి గవర్నర్ ఆమోదం లభించటంతో సర్కారు వెంటనే జీవో జారీ చేసింది. అంతే స్పీడ్ గా ఆయన కూడా బాధ్యతలు స్వీకరించారు. శనివారం సెలవు రోజు అయినా కూడా బాధ్యతలు స్వీకరించారు అంటే ప్రభుత్వం ఈ విషయంలో ఎంత పట్టుదలతో ఉందో అర్ధం అవుతోందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.