Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో కొత్తగా మరో 35 కేసులు

ఏపీలో కొత్తగా మరో 35 కేసులు
X

ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో కొత్తగా 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదు అయిన మొత్తం కేసుల సంఖ్య 757కు పెరిగింది. సోమవారం ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 75 కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. సోమవారంతో పోలిస్తే మంగళవారం ఈ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లే. గత 24 గంటల్లో కొత్తగా అనంతపురంలో మూడు, గుంటూరులో తొమ్మిది, కడపలో ఆరు, కృష్ణాలో మూడు, కర్నూలులో పది, పశ్చిమ గోదావరిలో నాలుగు కేసులు నమోదు అయ్యాయి.

మొత్తం 757 పాజిటివ్ కేసులకు గాను 96 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 22 మంది మరణించారు. ప్రస్తుతం ఏపీలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 639గా ఉంది. గడిచిన 24 గంటల్లో మొత్తం 5022 శాంపిల్స్ ను పరీక్షిస్తే..అందులో 35 మందికి పాజిటివ్ ఫలితం వచ్చిందని తెలిపారు.

Next Story
Share it