Telugu Gateway
Andhra Pradesh

మక్కీకి మక్కీ కాపీ కొట్టిన ఏపీ..తెలంగాణ జీతాల పాలసీనే!

మక్కీకి మక్కీ కాపీ కొట్టిన ఏపీ..తెలంగాణ జీతాల పాలసీనే!
X

మరీ మక్కీకి మక్కీ కాపీ కొడితే బాగోదు అనుకున్నట్లు ఉంది ఏపీ సర్కారు. ఒక్క దాంట్లో మాత్రం తేడా చూపించి మిగతా అంతా సేమ్ టూ సేమ్ దించేసింది.. సొంతంగా ఓ ఐడియా ఉండటం కంటే కాపీ కొట్టడం ఎవరికైనా చాలా ఈజీ కదా?. ఎప్పుడైనా ఫస్ట్ ఫస్టే..కాపీ కాపీనే. తెలంగాణ సర్కారు కరోనా నేపథ్యంలో ఆదాయం పడిపోయింది కాటట్టి అంటూ జీతాల్లో కొంత కోత పెట్టింది. కోత అనటం కంటే కొంత కాలం వాయిదా(డిఫర్ మెంట్) వేసింది. ఈ జీవోపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కనీసం అత్యవసర విభాగాలుగా గుర్తించిన వారికి అయినా వెసులుబాటు ఇవ్వకుండా కష్టకాలంలో కోతలు ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ కూడా అదే బాటలో పయనించింది. తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలతోపాటు ప్రజా ప్రతినిధులందరి వేతనాల్లో 75 శాతం (డిఫర్ మెంట్) తాత్కాలిక కోత పెట్టారు. కానీ ఏపీ సర్కారు మాత్రం ఈ ఒక్క జాబితాలో మాత్రం వందకు వంద శాతం వాయిదా వేసింది.

మిగిలిన అన్ని వర్గాలు అఖిలభారత సర్వీసు అధికారుల దగ్గర నుంచి ఉద్యోగులు, ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల వరకూ తెలంగాణలో ఏమి ఉత్తర్వులు ఇచ్చారో వాటినే ఏపీలో డిటోకు డిటో దించేశారు. తెలంగాణ అయినా, ఏపీ అయినా కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు భిన్నంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను వాయిదా వేసింది. ఓ వైపు ఉద్యోగులు, కార్మికులను ఈ కష్టకాలం ఇబ్బంది పెట్టకూడదు..పూర్తి జీతాలు ఇవ్వాల్సిందిగా కేంద్రం మార్గదర్శకాలు జారీ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం అందుకు భిన్నంగా ఉద్యోగుల వేతనాల్లో కోతపెట్టడం విశేషం. ఏపీలో కూడా కోత పెట్టాల్సి వచ్చినా కూడా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వారు, పోలీసులు, ఇతర అత్యవసర సిబ్బందిని ఈ కోత నుంచి మినహాయించి ఉండాల్సిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it