Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో 133 రెడ్ జోన్లు

ఏపీలో 133 రెడ్ జోన్లు
X

ఆంధ్రప్రదేశ్ లో కరోనా నివారణ చర్యల్లో భాగంగా కంటైన్మెంట్ క్లస్టర్లుగా సర్కారు చర్యలు ప్రారంభించింది. 13 జిల్లాల్లోనూ కొత్తగా 133 రెడ్ జోన్లుగా గుర్తించారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 30 రెడ్ జోన్లు ఉన్నాయి. కర్నూలులో 22, ప్రకాశంలో 11, పశ్చిమ గోదావరిలో 12, కృష్ణాలో 16 రెడ్ జోన్లుగా ప్రకటించారు. కరోనా పాజిటివ్ పేషంట్లు ఉన్న ప్రాంతాలను రెడ్ అలెర్ట్ ప్రకటించటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని సర్కారు హెల్త్ బులెటిన్ లో పేర్కొంది. ప్రతి క్లస్టర్ లోనూ వైరస్ నివారణ, ప్రజారోగ్య చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించటానికి క్వారంటైన్, భౌతికదూరం పాటించటం, మెరుగైన నిఘా, అనుమానాస్పద కేసులన్నంటి పరీక్షించటం వంటి చర్యలు ప్రారంభించారు.

దీంతోపాటు కాంటాక్ట్ అందరినీ ఐసోలేషన్ లో పెట్టడం వంటి చర్యలను కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కరోనా కేసులు ప్రాంతం నుంచి మూడు కిలోమీటర్ల చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కంటైన్మెంట్ క్లస్టర్ గా తీసుకుంటున్నట్లు తెలిపారు. కేసుల వ్యాప్తికి అవకాశం ఉన్న ఐదు కిలోమీరట్ల ప్రాంతం కూడా బఫర్ జోన్ గా గుర్తిస్తున్నట్లు తెలిపారు.అత్యవసరమైన సేవల విషయంలో తప్ప ఇక్కడి ప్రజలను బయటకు అనుమతించటం లేదని తెలిపారు.

Next Story
Share it