Telugu Gateway
Andhra Pradesh

జగనన్న విద్యాదీవెన ప్రారంభం

జగనన్న విద్యాదీవెన ప్రారంభం
X

రాష్ట్రంలోని సుమారు 12 లక్షల మంది విద్యార్ధులకు మేలు చేసేలా ఏపీలో సర్కారు ‘జగనన్న విద్యాదీవెన’ పథకానికి శ్రీకారం చుట్టింది. ‘పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఒక్క చదువే. మంచి చదువుతోనే పిల్లల భవిష్యత్ వస్తుంది’ అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన 1880 కోట్ల రూపాయలతోపాటు ఈ ఏడాదికి సంబంధించిన ప్రతి పైసా కూడా బకాయి లేకుండా చెల్లిస్తామని సీఎం తెలిపారు. 2020-21 విద్యా సంవత్సరంలో మాత్రం ప్రతి త్రైమాసికం తర్వాత తల్లుల ఖాతాలో డబ్బులు వేస్తామన్నారు. కాలేజీల్లో సౌకర్యాలు లేకపోతే మాత్రం తల్లులు 1902 నెంబర్ కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. తాడేపల్లిలో ఈ పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ వివిధ జిల్లాల విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు. బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకోచ్చామని తెలిపారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 4 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజును రీయింబర్స్‌ మెంట్‌ అందజేయనున్నారు. పిల్లలకు బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగు కోసం ఏడాదికి రూ.20 వేల వరకూ ఇస్తున్నాం. ఇది కూడా తల్లి అకౌంట్‌లోనే వేస్తున్నాం.

దీని వల్ల ఆ కుటుంబాలు అప్పుల పాలు కాకుండా, తమ పిల్లలను గొప్పగా చదివించగలుగుతారని ఆశిస్తున్నాం. కరోనా లాంటి కష్టాలు ఉన్నా కూడా.. మా ఇబ్బందుల కన్నా.. మీ ఇబ్బందులు పెద్దవి అని భావిస్తున్నాం. గడచిన సంవత్సరాల్లో అడ్మిషన్లు తీసుకున్న వారే కాకుండా.. పై తరగతులు చదువుతున్న వారికి కూడా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ వర్తింప చేస్తున్నాం. స్పెషల్‌ ఫీజులు.. ఇతరత్రా ఫీజులు కూడా ఉండవు. ఎవరైనా తల్లిదండ్రులు.. ఇప్పటికే కాలేజీలకు ఫీజు కట్టి ఉంటే.. ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్నాం కాబట్టి.. ఆ డబ్బను తల్లిదండ్రులకు వెనక్కి ఇవ్వాలి. తల్లిదండ్రులకు లేఖలు కూడా రాశాం... గ్రామ వాలంటీర్ల ద్వారా అవి చేరుతాయి. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యాలకు కూడా చెప్పడం జరిగిందన్నారు.

Next Story
Share it