Telugu Gateway
Cinema

విజయ్ దేవరకొండపై హీరోయిన్ ప్రశంసల వర్షం

విజయ్ దేవరకొండపై హీరోయిన్ ప్రశంసల వర్షం
X

అనన్య పాండే. ఈ భాలీవుడ్ భామ ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలసి ‘ఫైటర్’ సినిమా చేస్తోంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. తన హీరో విజయ్ పై అనన్య పాండే తెగ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఏకంగా ఇంత వరకూ తాను ఇలాంటి వ్యక్తిని చూడలేదని చెబుతోంది. అంతే కాదు..ఎంతో పెద్ద హీరో అయినా విజయ్ చాలా వినయంగా ఉంటారని..దయ ఉన్న వ్యక్తి అని పొగిడేస్తోంది.

అంతే కాదు విజయ్ చాలా సున్నితంగా మాట్లాడతారని తేల్చేసింది ఈ భామ. ముంబయ్ లో ఈ సినిమా షూటింగ్ ఏకంగా నెల రోజులపైనే సాగింది. తర్వాత షెడ్యూల్ కు కరోనా ఎఫెక్ట్ పడింది. పలు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ అనన్య పాండే ఈ విషయాలు వెల్లడించారు.

Next Story
Share it