Telugu Gateway
Cinema

అల్లు అర్జున్ ‘పుష్ప’ ఫస్ట్ లుక్ వచ్చేసింది

అల్లు అర్జున్ ‘పుష్ప’ ఫస్ట్ లుక్ వచ్చేసింది
X

సుకుమార్ మార్క్ ఫస్ట్ లుక్. రామ్ చరణ్ కు ‘రంగస్థలం’ ఎలాగో..అల్లు అర్జున్ కు ‘పుష్ప’ అలా కాబోతుందా?. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే అలాగే కన్పిస్తోంది. అటు రంగస్థలం దర్శకుడు సుకుమారే..ఇప్పుడు ఈ పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నది కూడా సుకుమారే. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించిన సినిమా టైటిల్ ను వెల్లడించటంతోపాటు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మాతలు. అల..వైకుంఠపురములో సినిమా సూపర్ డూపర్ హిట్ తో అటు అల్లు అర్జున్. ఇటు ఆయన ఫ్యాన్స్ ఫుల్ కుషీకుషీగా ఉన్నారు. అల్లు అర్జున్ కొత్త సినిమాలో ఆయనకు జోడీగా రష్మిక మందన నటిస్తోంది.

దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కస్తున్నట్లు సమాచారం. మంగళవారం నాడు మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చిన అప్ డేట్ లో వాడిన భాష కూడా ఈ వాదనను మరింత బలం చేకూరుస్తోంది. తొలుత ఈ సినిమాకు శేషాచలం పేరు పెడతారని కూడా ప్రచారం జరిగింది. ఇప్పుడు ‘పుష్ప’ టైటిల్ ను అధికారికంగా ప్రకటించటంతో దీనికి తెరపడింది. ఇది అల్లు అర్జున్ 20వ సినిమా.

Next Story
Share it