Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు రాజకీయ వైరస్ సోకింది

చంద్రబాబుకు రాజకీయ వైరస్ సోకింది
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తీవ్ర విమర్శలు చేశారు. కరోనా సమయంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు రాజకీయ వైరస్ సోకిందని ఆరోపించారు. కరోనా వైరస్ విషయంలో సీఎం జగన్ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంటే..చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారు..కరోన పై కాకుండా తమ ప్రభుత్వంపై, తమపై పోరాటం చేస్తున్నారన్నారు. ప్రపంచానికి కోవిడ్, చంద్రబాబు కి నీచ రాజకీయ వైరస్ సోకింది.కోవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే మాస్కులు కిట్లు లేవని నిందలు వేస్తున్నారు.డాక్టర్ సుధాకర్ కూడా ఎన్ 95 మాస్కులు లేవని లోకేష్, అయ్యన్నపాత్రుడు డైరెక్షన్ లో అసత్య ప్రచారం చేస్తున్నారు.

పిపిఈలు,ఎన్ 95 మాస్కుల కొరత లేదు..విశాఖపట్నం జిల్లాలో ఏ కొరత లేదు..ఎన్95 మాస్కులు 20,25 రోజులు వాడొచ్చు అని ప్రోటోకాల్ చెప్తోంది..డాక్టర్లు,ప్రభుత్వం,జగన్మోహన్ రెడ్డిపై డాక్టర్ ఆరోపణలు ఆక్షేపనీయం..ఈ ఆపత్కాలం లో డాక్టర్ల సేవలని కొనియడాల్సింది పోయి ఒక డాక్టర్ గా ఇలా మాటలు మాట్లాడటం నిందలు వేయడం మంచిది కాదు.ఆపరేషన్ డాక్టర్ వికటించడం తో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కోవిడ్ కోసం 3000 కోట్ల నిధులు విడుదల చేశాం. 1000 రూపాయలు,బియ్యం చక్కెర ఉచితంగా పేదలకు ఇస్తున్నాం..దేశంలోనే మెచ్చుకునే విధంగా గ్రామ వలంటేర్ వ్యవస్థ ఏర్పాటు చేశాం..ఒక డాక్టర్ అయి ఉండి,ఇలాంటి దూరాలోచన ఎందుకు వచ్చిందో తెలియదు..ప్రభుత్వం బురద చల్లాలని ఏదో ఏదో మాట్లాడటం సరికాదని మంత్రి విమర్శించారు.

Next Story
Share it