Telugu Gateway
Telangana

అత్తతో అక్రమ సంబంధం..భార్య సూసైడ్

అత్తతో అక్రమ సంబంధం..భార్య సూసైడ్
X

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. అత్తతో అల్లుడు అక్రమ సంబంధం కొనసాగించటం..విషయం తెలుసుకున్న భార్య తీవ్ర మానసినక వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకున్న వందన వయస్సు 19 సంవత్సరాలే. వీళ్లకు పెళ్లి అయి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు. ఈ ఘటన స్థానికంగా పెద్ద కలకలం రేపింది. తాను పెళ్ళి చేసుకున్న వ్యక్తితో మొదటి నుంచి తన తల్లికి అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న యువతి షాక్ కు గురైంది. పోలీసులు వెల్లడించిన సమాచారం ఇలా ఉంది. నగరంలోని మీర్‌పేట అల్మాస్‌గూడకు చెందిన వేలూరి అనిత కొన్నేళ్లుగా భర్త బాబురావుతో విడిపోయి పిల్లలతో కలిసి ఉంటోంది. అనిత క్యాటరింగ్‌ పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు నవీన్‌కుమార్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో నవీన్‌కుమార్‌ తరచూ అనిత ఇంటికి వచ్చేవాడు.

ఎలాగైనా శాశ్వతంగా ఇద్దరూ కలిసి ఉండాలన్న ఉద్దేశంతో డిగ్రీ మొదటి సంవత్సరం చదివే తన పెద్ద కుమార్తె వందన (19)ను నవీన్‌కుమార్‌కు ఇచ్చి అనిత గత సంవత్సరం డిసెంబరు 1న వివాహం జరిపించింది. వివాహమైన తరువాత కూడా నవీన్‌కుమార్‌ అనితల వివాహేతర సంబంధం అలాగే యధేచ్చగా కొనసాగింది. ఈ విషయం తెలుసుకున్న వందన విడిగా ఉందామని పలుమార్లు భర్తకు చెప్పగా, ఇంట్లో నుంచి వెళ్లిపోతే తాను చనిపోతానని తల్లి అనిత బెదిరించింది. తల్లి మోసం.. భర్త ప్రవర్తన కారణంగా తీవ్ర మానసిక వేదనకు గురైన వందన సూసైడ్‌నోట్‌ రాసి చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి మృతురాలి సోదరి సంజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it