Telugu Gateway
Cinema

‘ఫైటర్’ బిజీలో విజయ్ దేవరకొండ

‘ఫైటర్’ బిజీలో విజయ్ దేవరకొండ
X

విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ సినిమా షూటింగ్ చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇఫ్పటికే ఆయన 40 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ముంబయ్ లో ఈ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇందులో హీరో విజయ్ తోపాటు హీరోయిన్ అనన్య పాండే, రమ్యకృష్ణ, అలీ, రోనిత్ బోస్ల మధ్య వచ్చే సన్నివేశాలు పూర్తి చేసినట్లు చెబుతున్నారు.

ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా..ఛార్మి, కరణ్ జోహార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే. పూరీ, విజయ్ కాంబినేషన్ కావటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే విజయ్ తాజా సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫలితాన్ని చవిచూసింది.

Next Story
Share it