‘వి’ విడుదల వాయిదా పడుతుందా?
BY Telugu Gateway13 March 2020 8:18 PM IST
X
Telugu Gateway13 March 2020 8:18 PM IST
కరోనా ఎఫెక్ట్ టాలీవుడ్ పై కూడా పడనుందా?. వాతావరణం చూస్తుంటే అలాగే కన్పిస్తోంది. ఇప్పటికే భారత్ లోనూ పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో షాపింగ్ మాల్స్ తో పాటు థియేటర్లు కూడా మూతపడుతున్నాయి. దీంతో టాలీవుడ్ లోనూ టెన్షన్ మొదలైంది. షెడ్యూల్ ప్రకారం నాని, సుధీర్ బాలు నటించిన సినిమా ‘వి’ ఈ నెల 25న విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ గందరగోళ వాతావరణంలో విడుదల చేసే కంటే కరోనా ప్రభావం తగ్గాక..ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్లకు వచ్చే సమయంలోనే సినిమాను విడుదల చేయాలనే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా థామస్, అదితిరావు లు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది నానికి 26వ సినిమా. వి సినిమా కొత్త రిలీజ్ డేట్ తెలియాంటే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన వరకూ వేచిచూడాల్సిందే.
.
Next Story