Telugu Gateway
Telangana

కేంద్రాన్ని మాస్క్ లు కోరాం

కేంద్రాన్ని మాస్క్ లు కోరాం
X

తెలంగాణలో కరోనా నియంత్రణకు సర్కారు వంద కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశించారని వెల్లడించారు. కరోనా వైరస్ పై కెసీఆర్ నివేదిక తీసుకుని చర్చలు జరిపారన్నారు. కరోనా వచ్చిన యువకునితో 88 మంది కలిశారు అని సమాచారం ఉందన్నారు. ‘ఈ 88 మందిలో ఇప్పటి వరకు 45 మందిని గాంధీ లో టెస్టులు చేస్తున్నాము. కరోనా రోగికి నిన్నటి నుంచి మెరుగైన చికిత్స అందిస్తున్నాము. దుబాయ్ నుంచి వచ్చిన యువకుని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. 80వేల మందికి కరోనా సోకితే...2వేలకు పైగా మాత్రమే మృతి చెందారు.గతంలో ఎబోలా కంటే భయంకరమైన వ్యాధి కరోనా కాదు. కరోనా గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. గాలి ద్వారా కరోనా సోకే ఆస్కారం లేదు. మనిషి మాట్లాడినప్పుడు తుంపర్ల ద్వారా సోకే అవకాశం మాత్రమే ఉంటుంది.

మనిషి శుభ్రంగా ఉంటే ఎలాంటి వ్యాధి సోకదు. మనిషికి తెలియకుండా మాములు 80శాతం జలుబు సోకి వచ్చి పోతుంది. 14 శాతం కరోనా వస్తే ట్రీట్మెంట్ ద్వారా నయం అవుతుంది. 3 శాతం రోగులకు మాత్రమే కరోనా వ్యాధి తీవ్రత సీరియస్ గా ఉంటుంది. కరోనా వచ్చినట్లు అనుమానం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. తెలంగాణ రాష్ట్రంలో నివసించే ప్రజలకు ఒక్కరికి కూడా కరోనా రాలేదు. గాంధీ తో పాటు చెస్ట్ హాస్పిటల్-మిలటరీ హాస్పిటల్-వికారాబాద్ అడవుల్లో ఉన్న హాస్పిటల్ ని వాడుతున్నాము. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 3వేల బెడ్స్ తో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాము. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాం. తెలంగాణ లో మాస్క్ ల కొరత ఉంది-కేంద్రాన్ని మాస్క్ లను అందించాలని కోరాము. స్కూల్ కు వెళ్ళే వాల్లు.. అన్ని రకాల ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచారం చేస్తాం. హెల్ప్ లైన్ 104 ని ఏర్పాటు చేసాము...రేపటి నుంచి నెంబర్ పనిచేస్తుంది. అన్ని శాఖల సమన్వయంతో నివారణ చర్యలు తీసుకుంటున్నాము. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన దేశాల టూర్లకు వెళ్లకుండా వాయిదా వేసుకోవాలని కోరుతున్నాము.’ అని ఈటెల తెలిపారు.

Next Story
Share it