Telugu Gateway
Telangana

తెలంగాణలో మార్చి 31వరకూ స్కూళ్ళు..సినిమా హాళ్ళు బంద్

తెలంగాణలో మార్చి 31వరకూ స్కూళ్ళు..సినిమా హాళ్ళు బంద్
X

కరోనా ప్రభావంతో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకూ తెలంగాణలో పాఠశాలతోపాటు సినిమా హాళ్ళు, మాల్స్ బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జనసందేహాలు ఉండటం వల్ల వైరస్ వ్యాపించే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని పలు రాష్ట్రాలు ఇదే బాటలో పయనిస్తుండటంతో తెలంగాణ కూడా ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో తెలంగాణ శాసనసభ సమావేశాలను కూడా కుదించారు. వాస్తవంగా ఈ సమావేశాలు మార్చి 20 వరకూ కొనసాగాల్సి ఉంది. ఇప్పుడు సోమవారం తో సమావేశాలు ముగించాలని నిర్ణయించారు.

పరీక్షలు మాత్రం యతాతధంగా సాగనున్నాయి. ముఖ్యమంత్రి కెసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఇదే సరైన నిర్ణయం అనే అభిప్రాయం వ్యక్తం అయింది. తొలుత దేశంలో కరోనా కేసుల సంఖ్య నామమాత్రంగానే ఉన్నా క్రమక్రమంగా ఇది పెరుగుతోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిలోనే ఈ కేసులు బహిర్గతం అవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం కూడా పలు దేశాల ప్రయాణికుల వీసాలను కూడా రద్దు చేసిన సంగతి తెలిసిందే.

Next Story
Share it