Telugu Gateway
Telangana

తెలంగాణలో 65కు చేరిన కేసులు..తొలి మరణం నమోదు

తెలంగాణలో 65కు చేరిన కేసులు..తొలి మరణం నమోదు
X

తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదు అయింది. ఆరోగ్య సమస్యలతో ఉన్న 74 సంవత్సరాల వయస్సు ఉన్న వ్యక్తి, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత ఆయన మరణించటంతో రాష్ట్రంలో తొలి కరోనా మరణం నమోదు అయినట్లు అయింది. అయితే శనివారం నాటికి తెలంగాణలో కొత్తగా ఆరు కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఈ కేసుల సంఖ్య 65కి చేరింది. కుత్బుల్లాపూర్ ఏరియా నుంచి ఒకే కుటుంబం నుంచి నాలుగు కేసులు నమోదు అయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఆయన శనివారం నాడు మీడియాతో మాట్లాడారు. ఈటెల విలేకరుల సమావేశంలోని ముఖ్యాంశాలు ‘కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి సమాచారం మాకు అందించాలి. సీఎం ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. శనివారం నాడు కొత్తగా 6 కేసులు కొత్తగా వచ్చాయి.

ఏ హాస్పిటల్ లో ఎలాంటి సమస్య లేదు. కరోనా పై తప్పుడు ప్రచారం చేయకండి. ఆరు రోజుల్లో గచ్చిబౌలి లో స్పోర్ట్స్ కాంప్లెక్ రెడి అవుతుంది. గాంధీ వైద్యులకు వారి వారి ఏరియాల్లో ప్రజలెవ్వరు ఇబ్బంది పెట్టొద్దు. అలాంటి వైద్యులకు అండగా ఉండాలి. క్వారంటైన్ లో ఉన్న వారి సంఖ్య తగ్గుతుంది. ఒక్క వ్యక్తికి వస్తే కుటుంబం అంతా వచ్చే ప్రమాదం ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారు బాధ్యతగా ఉండాలి. సీఎం ఆదేశాలతో 24 గంటలు ఆన్ డ్యూటీ లో ఉంటున్నాము. హైదరాబాద్ లో ఎక్కడ రెడ్ జోన్ లేదు. ప్రార్థన మందిరాల్లోకి ప్రజాలెవరూ వెళ్ళకండి. శనివారం నమోదు అయిన కేసుల్లో మూడు కేసులు ఢిల్లీ ప్రార్థన మందిరాల్లోకి వెళ్లిన వారివే. వైద్యులు-ఎయిర్ పోర్ట్ లోని స్క్రినింగ్ లో పనిచేసే సిబ్బంది- వారి కుటుంబాలకు కరోనా సోకింది. రోగుల దగ్గర పనిచేసే సిబ్బంది-వ్యక్తులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.’ అని సూచించారు.

Next Story
Share it