Telugu Gateway
Andhra Pradesh

జగన్ సర్కారుకు సుప్రీంలో చుక్కెదురు

జగన్ సర్కారుకు సుప్రీంలో చుక్కెదురు
X

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో జగన్ సర్కారుకు సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. అయితే ఓ విషయంలో మాత్రం ఊరట దక్కింది. ఆరు వారాల పాటు కోడ్ అమల్లో ఉంటుంది అన్న ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఎత్తేసింది. ఎన్నికల నిర్వహణలో కమిషన్ దే తుది నిర్ణయం అని..ఆరు వారాల పాటు ఎన్నికలు వాయిదా వేయాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం సరైనదే అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికల వాయిదాని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆరు వారాల తర్వాత పరిస్తితిపై సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఈసీ కి అప్పగించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈకేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బోబ్డే, జస్టిస్ బీ ఆర్ గవాయి, జస్టిస్ సూర్యకాంత్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించకుండా ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ ఏపీ సర్కారు సుప్రీంకోర్టు ను ఆశ్రయించగా..అక్కడ కూడా జగన్ సర్కారుకు నిరాశే ఎదురైంది. దీంతో ఎలాగైనా ఎన్నికలు జరిపించాలని పట్టుదల ప్రదర్శించిన ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. కొత్త ఎన్నికల తేదీలు ప్రకటించాక నాలుగు వారాల ముందు నుంచి కోడ్ అమల్లో ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వంలో చర్చించి కొత్త తేదీలను ఖరారు చేయాలని సూచించింది. ఎన్నికలు వాయిదా వేసినందున కోడ్ కొనసాగించటం సరికాదని సుప్రీం వ్యాఖ్యానించింది.

Next Story
Share it