Telugu Gateway
Telangana

రేవంత్ కు దక్కని బెయిల్

రేవంత్ కు దక్కని బెయిల్
X

అక్రమంగా డ్రోన్ ఉపయోగించారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డికి బెయిల్ దక్కలేదు. ఆయన బెయిల్ పిటీషన్ మంగళవారం నాడు విచారణకు రానుంది. దీంతో ఆయన మరో మూడు రోజులు చంచల్ గూడ జైలులోనే గడపాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇదే కేసులో అరెస్ట్ అయిన మిగిలిన ఐదుగురికి మాత్రం బెయిల్ దొరికింది. ఈ కేసులో రేవంత్‌ను మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. మరోవైపు రేవంత్‌ అరెస్ట్‌ పై కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కుట్రపూరితంగానే ప్రభుత్వంపై ఆయనపై అక్రమ కేసులో మోపుతోందని కార్యకర్తలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. మంత్రి కెటీఆర్ ఉపయోగిస్తున్న గెస్ట్ హౌస్ గా చెబుతున్న ప్రాంతాన్ని కొద్ది రోజుల క్రితం డ్రోన్ తో చిత్రీకరించారు. జీవో 111ని ఉల్లంఘించి మరీ ఇందులో విలాసవంతమైన భవనాలు కట్టుకుని..కెటీఆర్ ఉంటున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఓ వైపు అక్రమ కట్టడాలను సహించమని చెప్పే మంత్రే..అక్రమ కట్టడంలో ఎలా ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

Next Story
Share it