Telugu Gateway
Politics

రేవంత్ రెడ్డి అరెస్ట్

రేవంత్ రెడ్డి అరెస్ట్
X

తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరీ ఎంపీ రేవంత్ రెడ్డిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ ఉపయోగించారనే కేసుల్లో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ది గా చెబుతున్న ఫార్మ్ హౌస్ పై డ్రోన్ కెమరాతో చిత్రీకరణ చేసిన కేసులో ...అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రేవంత్ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఇఫ్పటికే డ్రోన్ ఉపయోగానికి సంబంధించి ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

111 జీవో పరిధిలో మంత్రి కెటీఆర్ భారీ ఫార్మ్ హౌస్ ను, గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొద్ది రోజుల క్రితం మీడియాను తీసుకుని మరీ ఆయన ఫార్మ్ హౌస్ ప్రాంతానికి వెళ్లారు. రేవంత్ పై ఐపీసీ 184,187 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డిని విమానాశ్రయంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైకోర్టును ఆశ్రయించిన రేవంత్ రెడ్డి సోదరులు

భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి సోదరులు హైకోర్టును ఆశ్రయించారు. శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి గ్రామంలోని తమ భూమిని ప్రభుత్వం అక్రమంగా లాక్కోవాలని చూస్తుందంటూ గురువారం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 2005లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న భూమిని ఖాళీ చేయించడానికి కుట్ర చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.ఇప్పటి వరకు తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కోర్టుకు నివేదించారు. తమ భూమిని తమ నుంచి దూరం చేయకుండా రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. రేవంత్‌ సోదరుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. అసలు ఏం జరిగిందనే దానిపై అధికారులను అడిగి తెలుసుకుంటామని చెప్పారు. శుక్రవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న చట్టం ప్రకారం నడచుకోవాలని అధికారులకు సూచించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

Next Story
Share it