Telugu Gateway
Politics

సోషల్ మీడియాపై అసలు విషయం చెప్పిన మోడీ

సోషల్ మీడియాపై అసలు విషయం చెప్పిన మోడీ
X

ప్రధాని నరేంద్రమోడీ తన ‘సోషల్ మీడియా’ ఖాతాలకు సంబంధించి అసలు విషయం చెప్పేశారు. ఆదివారం నాడు తాను అన్ని ఖాతాల నుంచి దూరంగా ఉంటానని ప్రకటించి కలకలం రేపారు. అయితే అది ఎందుకో మంగళవారం నాడు క్లారిటీ ఇచ్చేశారు. ఈ లోగానే అసలు దేశంలోనే సోషల్ మీడియాను బ్యాన్ చేసే యోచనలో సర్కారు ఉందని..అసలు మోడీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ పలు విమర్శలు వచ్చాయి. దీంతోపాటు పలు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. విపక్షాలు కూడా ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగానే తీవ్రంగా స్పందించాయి. తాను ఈ ఒక్క ఆదివారం మాత్రమే సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటానని మోడీ ప్రకటించారు.

తానెందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లను వదిలేస్తానన్నది స్పష్టం చేస్తూ మోదీ మంగళవారం ఓ ట్వీట్‌ చేశారు. ఓ మంచి కార్యక్రమం కోసం ఆదివారం ఒక్కరోజే తన సోషల్ మీడియా అకౌంట్లను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. ‘ వచ్చే ఆదివారం .. మహిళా దినోత్సవం. మనకు స్ఫూర్తిగా నిలిచిన మహిళల కోసం నా సోషల్ మీడియా అకౌంట్లను వారికి అప్పగిస్తున్నాను. అలా చేయడం వల్ల వాళ్లు లక్షలాది మందిని ఉత్సాహపరిచినట్లు అవుతుంది. మీరు అలాంటి మహిళేనా? లేదా అలాంటి మహిళలు మీకు తెలుసా? అయితే అలాంటి మహిళల స్టోరీస్ #SheInspireUs‌తో ట్యాగ్ చేయండి’ అని ట్వీట్ చేశారు.

Next Story
Share it