పవన్ కళ్యాణ్ సినిమా ప్రీలుక్ రిలీజ్
BY Telugu Gateway1 March 2020 2:34 PM IST
X
Telugu Gateway1 March 2020 2:34 PM IST
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్ స్టార్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ సోమవారం సాయంత్రం విడుదల కానుంది. ఇది బాలీవుడ్ సినిమా పింక్ కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ కు ముందు ప్రీ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
‘అజ్ఞాతవాసి’ తర్వాత పవన్ వెండితెరపై కన్పించనున్న సినిమా ఇదే. దీంతో ఆయన అభిమానుల్లో దీనిపై ఎంతో ఆసక్తి ఉంది. సోమవారం ఫస్ట్ లుక్ తోపాటు సినిమా టైటిల్ ను కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. బోని కపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు.
Next Story