పరిమల్ నత్వానీ ఆసక్తికర ట్వీట్
BY Telugu Gateway9 March 2020 6:42 PM IST

X
Telugu Gateway9 March 2020 6:42 PM IST
వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యత్వం పొందిన పారిశ్రామికవేత్త, ముఖేష్ అంబానీ సన్నిహితుడు పరిమల్ నత్వానీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. రాజ్యసభ సీటు కేటాయించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. అంతే కాదు ఏపీ ప్రజలు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అందులో పేర్కొన్నారు. ఈ రెండింటి విషయంలో ఆశ్ఛర్యపోవాల్సిన అంశాలు ఏమీ లేవు. అయితే అదే ట్వీట్ ను నత్వానీ ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హో మంత్రి అమిత్ షాకు ట్యాగ్ చేయటం ఆసక్తికరంగా మారింది. పరిమల్ నత్వానీకి వైసీపీ రాజ్యసభ కేటాయింపుపై రకరకాల ప్రచారాలు ఉన్న సమయంలో ఈ పరిణామం చర్చనీయాంశం అయింది.
Next Story