కరోనా కాదు..ఏదొచ్చినా నా పెళ్ళి ఆగదు
నిఖిల్ తన పెళ్ళి విషయంలో ఏ మాత్రం రాజీలేదు అంటున్నాడు. కరోనా కాదు..ఏమోచ్చినా సరే తన పెళ్లి ఆగదు అని స్పష్టం చేశాడు. కరోనా కారణంతో నిఖిల్ తోపాటు నితిన్ పెళ్లిళ్ళు ఆగే అవకాశం ఉందంటూ కొన్ని మీడియాల్లో వార్తలు వచ్చాయి. దీంతో నిఖిల్ మాత్రం ముందు నిర్ణయించుకున్న తేదీ ప్రకారమే తన పెళ్లి జరుగుతుందని అన్నారు. పెళ్ళి వాయిదా పడిందనే వార్తల్లో ఏ మాత్రం నిజంలేదన్నారు. ఒకవేళ విపత్కర పరిస్థితులు వస్తే గుళ్లో అయినా సరే పెళ్లి చేసుకుంటాం అని స్పష్టం చేశారు.
తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని సూచించారు. తాను ప్రేమించిన డాక్టర్ పల్లవితో నిఖిల్ పెళ్ళి జరగనున్న విషయం తెలిసిందే. 'ఏప్రిల్‌లో పరిస్థితి ఎలా ఉన్నా.. నా పెళ్లి వాయిదా పడే ప్రసక్తి లేదు. ఇప్పటికే కన్వెన్షన్ హాల్‌ను అడ్వాన్స్ గా బుక్ చేసుకొన్నాం. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. ఆహ్వాన పత్రికలు కూడా బంధువులకు పంపిస్తున్న నేపథ్యంలో ఇక ఏది వచ్చినా పెళ్లి మాత్రం ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. అయితే వచ్చేవారానికల్లా పరిస్థితులు మెరుగుపడుతాయనే ఆశాభావంతో ఉన్నాం' అని నిఖిల్ అన్నారు.