Telugu Gateway
Politics

కెసీఆర్ బాటలోనే మహారాష్ట్ర

కెసీఆర్ బాటలోనే మహారాష్ట్ర
X

మహారాష్ట్ర కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ మోడల్ నే ఫాలో అవుతోంది. తెలంగాణ సర్కారు సోమవారం నాడు రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతోపాటు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మహారాష్ట్ర కూడా అదే బాటలో పయనిస్తోంది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా ప్రజా ప్రతినిధుల వేతనాల్లో కోత విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. మార్చి నెల వేతనంలో 60 శాతం కోత విధిస్తున్నట్టు డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి అజిత్‌ పవార్‌ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... క్లాస్‌ 1,2 ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50శాతం కోత పెట్టారు.

క్లాస్‌ 3 ఉద్యోగుల వేతనాల్లో 25శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించారు. క్లాస్‌ 4 ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వనున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా అడ్డుకోవడానికి భారీ ఎత్తున నిధులు సమకూర్చడంతో పాటు, లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు రాకపోడంతో వేతనాలు కోత పెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే రోజుల్లో పలు రాష్ట్రాలు ఇదే మోడల్ ను ఫాలో అయ్యే అవకాశం కన్పిస్తోంది.

Next Story
Share it