Telugu Gateway
Politics

కాంగ్రెస్..బిజెపిలపై కెసీఆర్ ఫైర్

కాంగ్రెస్..బిజెపిలపై కెసీఆర్ ఫైర్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బిజెపిలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మూస పద్దతులు వదులుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని ఎందుకు కోల్పోయారో సమీక్షించుకోవాలని సూచించారు. సభలో భట్టి విక్రమార్క అనవసర ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ప్రజలు తిరస్కరిస్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు ఇంకా జ్ఞానం రావటం లేదన్నారు. కనీసం చెప్పేది అయినా అర్ధం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బిజెపి తీరుపై కూడా కెసీఆర్ విమర్శలు చేశారు. ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తే కేంద్రంలో బిజెపికి లోకి అధికారంలోకి వచ్చిందని..కానీ తాము తెలంగాణ వచ్చాక పోటీచేసిన తొలిసారే అధికారంలోకి వచ్చామన్నారు. కాంగ్రెస్ పై వ్యతిరేకతతోనే కేంద్రంలో బిజెపికి అధికారం కట్టెబెట్టారన్నారు.

రాష్ట్రంలో గెలిచిన ఎంపీల నుండి హోమ్ మంత్రి వరకు ఇక్కడికి వచ్చి తెలంగాణకు అంత ఇంత ఇచ్చామని గొప్పలు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. జీఎస్టీ వల్ల దేశానికి ఒరిగిందేమి లేదు..అప్పట్లో ఆర్థిక మంత్రి చిదంబరం కూడా జీఎస్టీ పెట్టారు కానీ ఎన్డీయే జీఎస్టీ ని తీసుకొచ్చింది..ఇప్పుడున్న కేంద్రాన్ని నమ్ముకుంటే శంకరి గిరి మాన్యాలే అని వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల్లో 3900 కోట్లు పెండింగ్ లో ఉంటే 1400 కోట్లు అడిగితే ఇచ్చారన్నారు. పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్ అనేది కేంద్రానికి అధికారులు ఉండరు. అందుకే రాష్ట్రానికి నిధులు ఇవ్వాల్సిందే. ఈ ఐదేళ్లలో 10 వేల కోట్లు మాత్రమే ఏటా రాష్ట్రానికి వస్తున్నాయని తెలిపారు.

కేంద్రానికి ఆకాశం నుండి ఊడిపడటం లేదు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రాలు కేవలం రెండు మూడే..అందులో ప్రత్యేకంగా తెలంగాణ ఒకటి..మిగతా వన్నీ అడుక్కునే రాష్ట్రాలే. బీజేపీ ఇప్పటికైనా నీచబుద్ది మానుకోవాలి . ప్రకృతి వైపరీత్యాల వల్ల కొంత పంట నష్టం జరుగుతుంది..ప్రతి గింజ కొనాలే అని వీళ్ళు అంటారు . ఈ ఏడాది ఒక్క రైతు కూడా ఇబ్బంది పడలేదు. ప్రతి గింజ కొనుగోలు చేసాం. కాంగ్రెస్ అధికాలో ఉన్నప్పుడు రాయితీలు ఇవ్వలేదు. మన దగ్గర కరోనా లేదు..ఇక్కడి నుండి కోళ్లు గుడ్లు ఎగుమతి చేస్తుంటాం..దీంట్లో కుంభకో లంబకోణం లేదు. పౌల్ట్రీ రంగం లో మీ వాళ్లే ఉన్నారు విమర్శలు ప్రతి దానికీ అవసరం లేదు అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it