వైసీపీలో చేరిన కదిరి బాబూరావు
BY Telugu Gateway10 March 2020 5:59 PM IST

X
Telugu Gateway10 March 2020 5:59 PM IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు తనను నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ఇక చంద్రబాబుపై నమ్మకం లేకే పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నందమూరి తారకరామారావు, బాలకృష్ణలు వేరు...నారా చంద్రబాబునాయుడు వేరు అని వ్యాఖ్యానించారు. వాళ్ళకు చంద్రబాబుకు అసలు పోలికే లేదన్నారు. బాలకృష్ణ తన మిత్రుడు కావటం వల్లే తాను ఇంత కాలం పార్టీలో ఉన్నానని వ్యాఖ్యానించారు.
ఆయన మంగళవారం నాడు తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై ఉన్న నమ్మకంతోనే వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్టు తెలిపారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు కనీసం తనకు చెప్పకుండా దర్శికి పంపి.. బలవంతంగా అక్కడి నుంచి పోటీ చేయించారని గుర్తుచేశారు.
Next Story