Telugu Gateway
Cinema

ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

ఎన్టీఆర్, రామ్ చరణ్  ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
X

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి తొలి అప్ డేట్ ఉగాది రోజు రానుంది. ఈ విషయాన్ని హీరో ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించి అప్ డేట్స్ ఏమీ ఇవ్వకపోవటంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

తెలుగువారి తొలి పండగ అయిన ఉగాది రోజు ఆర్ఆర్ఆర్ అభిమానుల కోరిక తీరనుంది. ఎందుకంటే పండగ రోజు టైటిల్ లోగోతోపాటు మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘స్టే సేఫ్..స్టే హోమ్’ అంటూ ఎన్టీఆర్ అసలు విషయాన్ని వెల్లడించారు.

Next Story
Share it