Telugu Gateway
Cinema

రానా ‘ఆరణ్య’ విడుదల కూడా ఆగింది

రానా ‘ఆరణ్య’ విడుదల కూడా ఆగింది
X

సినిమాలపై కరోనా ప్రభావం బాగానే పడుతుంది. వరస పెట్టి సినిమాల విడుదలకు బ్రేక్ లు పడుతున్నాయి. ఇఫ్పటికే మార్చి 25న విడుదల కావాల్సిన ‘వి’ సినిమా విడుదలను వాయిదా వేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చేపట్టే ముందస్తు చర్యల్లో భాగంగా తెలంగాణ సర్కారు వారం పాటు థియేటర్లు మూసివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. మార్చి 21న మరోసారి సమీక్షించి ఈ మూసివేత కొనసాగించాలా? లేక ఎత్తివేయాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

పలు భాషల్లో తెరకెక్కించిన దగ్గుబాటి రానా సినిమా ‘అరణ్య’ విడుదలను కూడా వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రభు సోలోమాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తొలుత ఏప్రిల్‌ 2 విడుదల చేయాలని భావించారు. కానీ దేశంలో క్రమంగా కరోనా ప్రభావం పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. ‘త్వరలో థియేటర్లలో కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి’. అంటూ నిర్మాతలు ట్వీట్‌ చేశారు.

Next Story
Share it