Telugu Gateway
Politics

కాంగ్రెసే దేశానికి పట్టిన అతి పెద్ద కరోనా వైరస్

కాంగ్రెసే దేశానికి పట్టిన అతి పెద్ద కరోనా వైరస్
X

దేశానికి పట్టిన అతిపెద్ద కరోనా వైరస్ కాంగ్రెస్ పార్టీయేనని తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆ వైరస్ చాలా వరకూ పోయిందని..అయినా ఇంకా కొంత ఉందని అన్నారు. ప్రతి విషయంలోనూ రాజకీయాలు చేయటం సరికాదని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి కెసీఆర్ శనివారం నాడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తరపున మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ కరోనా వైరస్ తెలంగాణలో ప్రబలకుండా ఉండాలనే తాము కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. వైరస్ నివారణకు సీఎం కెసీఆర్ ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెబుతున్నారని..ఇది డబ్బుల సమస్య కాదని..లక్షల కోట్ల రూపాయలు ఉన్న దేశాలను కూడా ఇది వణికిస్తుందని తెలిపారు. సీఎం కెసీఆర్ ఒక్క పారాసిటమాల్ తో కరోనా వైరస్ తగ్గుతుందని చెప్పారని మాట్లాడుతుండగానే..భట్టివిక్రమార్క మైక్ కట్ అయింది.

తాను ఓ నిపుణుడు చెపితే పారాసిటమాల్ గురించి మాట్లాడానని..ఇది రికార్డుగా ఉందని వ్యాఖ్యానించారు. కరోనా నియంత్రణ విషయంలో కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని..ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాలకు చెందిన వారి వీసాలు కూడా రద్దు చేసిందని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు..కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా చర్యలు తీసుకుంటున్నాయని..ప్రతి దాంట్లో రాజకీయం తగదని విమర్శించారు. ఇలాంటి సమయంలో నేతలు బాధ్యతగా మాట్లాడాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా నియంత్రణకు చాలా చర్యలు తీసుకుందని..అన్నీ బయటకు చెప్పి ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలా? అని ప్రశ్నించారు.

Next Story
Share it