Telugu Gateway
Cinema

ఉగాది రోజే చిరు ఎంట్రీ

ఉగాది రోజే చిరు ఎంట్రీ
X

మెగా స్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి చాలా కాలం అయింది. మరి ఇప్పుడు చిరు ఎంట్రీ ఏంటి అంటారా?. టాలీవుడ్ లో యువ హీరోలకు పోటీగా చిరంజీవి సోషల్ మీడియాలోకి ప్రవేశిస్తున్నారు. అదీ తెలుగు సంవత్సరాది అయిన ఉగాది రోజు నుంచి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు. ఇక చిరంజీవి సినిమాలకు సంబంధించిన అంశాలతోపాటు పలు అప్ డేట్స్ ఆయన ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు దీని ద్వారా లభించనుంది. . పెద్ద ఎత్తున అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీకి ఇప్పటి వరకు సోషల్‌ మీడియా అకౌంట్లు లేవు.

ఇకపై సోషల్‌ మీడియా ద్వారా తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటానని అన్నారు. ‘ఇక నేను కూడా సోషల్ మీడియాలోకి ఎంటర్‌ అవుదామనుకుంటున్నాను. దానికి కారణం ఎప్పటికప్పుడు నా భావాలను నా అభిమానులతో షేర్ చేసుకోవడానికి.. అలాగే, నేను ఇవ్వాలనుకునే మెసేజ్‌లు కానీ, చెప్పాలనుకునే విషయాలను కానీ.. ప్రజలతో చెప్పుకోవడానికి వేదికగా భావిస్తూ.. నేను ఇక మీదట సోషల్‌ మీడియాలోకి ఎంటర్‌ అవుతున్నాను. అది ఈ ఉగాది రోజు నుంచే’ అంటూ వీడియోలో ద్వారా చిరంజీవి ఈ విషయాన్ని తెలియజేశారు.

Next Story
Share it