Telugu Gateway
Andhra Pradesh

సీఎం మంత్రులను బెదిరించినట్లు నిమ్మగడ్డ ఎలా చెబుతారు?

సీఎం మంత్రులను బెదిరించినట్లు నిమ్మగడ్డ ఎలా చెబుతారు?
X

ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రసాద్ పై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవకపోతే పదవులు పోతాయని మంత్రులను బెదిరించినట్లు లేఖలో ఎలా ప్రస్తావిస్తారని..దీనికి సంబంధించిన ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. అసలు రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన కేంద్ర హోం శాఖకు ఎలా లేఖ రాస్తారన్నారు. బుగ్గన శనివారం నాడు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర హోం శాఖకు రమేష్ లేఖ రాశారో లేదో స్పష్టం చేయాలని బుగ్గన డిమాండ్ చేశారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేసే ముందు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించలేదని ప్రశ్నించారు. కరోనా గురించి తెలుసుకనుకే సర్కారు అప్రమత్తం అయిందని తెలిపారు. స్థానిక ఎన్నికలు ఆపాలని ఎవరైనా కుట్ర చేస్తున్నారా?. ఎన్నికలు ఆపేందుకు తోమర్ కేసును ఎందుకు వాడుతున్నారు. సుప్రీంకోర్టులో ఎస్ఈసీ ఎందుకు కేవియట్ వేశారు? .ఇది ఏమైనా వ్యక్తిగత వివాదమా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అప్రజాస్వామికం అని ధ్వజమెత్తారు.

ఎస్ఈసీకి సీఎస్ లేఖ రాసిన తర్వాత కూడా సీఎస్‌తో ఎందుకు మాట్లాడలేదు? కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేస్తే కోడ్ ఎందుకు కొనసాగించారు’’ అని ప్రశ్నించారు. అధికార పార్టీ ఒత్తిడి ఉంటే ప్రతిపక్షాలు భారీ స్థాయిలో నామినేషన్లు ఎలా వేసాయన్నారు. టీడీపీ వాళ్లు నామినేషన్లు వేయకుంటే దానికి అధికారపార్టీ బాధ్యత వహిస్తుందా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ జిల్లాలో వైసీపీ వంద శాతం సీట్లు గెలిచిందని.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం కావడంలో తప్పేముందన్నారు. ప్రజా మద్దతు తమకుంది కాబట్టే మెజార్టీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని పేర్కొన్నారు.

Next Story
Share it