Telugu Gateway
Cinema

అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ సర్ ప్రైజ్

అదిరిపోయిన ‘ఆర్ఆర్ఆర్’ సర్ ప్రైజ్
X

రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్‘ చిత్ర యూనిట్ విడుదల చేసిన ‘భీమ్ ఫర్ రామరాజు’ వీడియో అదిరిపోయింది. ఈ సినిమా రామ్ చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రను వర్ణిస్తూ మరో హీరో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వీడియోను విడుదల చేశారు. ఇందులోని డైలాగ్ లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘ఆడు కనపడితే నిప్పు కణం నిలబడినట్లు ఉంటది. కలబడితే యేగు సుక్క ఎగబడినట్లు ఉంటది. ఎదురుబడితే సావుకైనా చెమట ధార కడదది. బాణమైనా, బంధూకైనా అనికి బాంచన్ ఐతది’ అంటూ ఎన్టీఆర్ వాయిస్ తో కూడిన డైలాగ్ లు అదిరిపోయాయి. డైలాగ్ లకు తగ్గట్లు రామ్ చరణ్ యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. తాజాగా టైటిల్ తోపాటు మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్ శుక్రవారం నాడు ఈ కొత్త వీడియోను తీసుకొచ్చింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా రౌద్రం రణం రుధిరంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటిస్తున్న విషయం తెలిసిందే. కొత్త విడుదల చేసిన వీడియోలో కీరవాణి అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ దద్దరిల్లేలా ఉంది.

73 సెకన్ల పాటు సాగిన ‘బీమ్‌ ఫర్‌ రామరాజు’ వీడియోను తెలుగులో డీవీవీ మూవీస్‌, తమిళంలో ఎన్టీఆర్‌, హిందీలో అజయ్‌ దేవగణ్‌, కన్నడలో వారాహి, మలయాళంలో రామ్‌చరణ్‌లు సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇందులో ఎన్టీఆర్‌కి జోడీగా ఒలివియా మోరిస్, రామ్‌ చరణ్‌కి జోడీగా ఆలియా భట్‌ నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్, హాలీవుడ్‌ స్టార్స్‌ రే స్టీవెన్‌ సన్స్ , అలిసన్‌ డూడీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం 2021 సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=2_BkCz3OnlY

Next Story
Share it