Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు

ఏపీలో జిల్లా పరిషత్ ఛైర్మన్ల రిజర్వేషన్లు ఖరారు
X

ఆంధ్రప్రదేశ్ లో మరో ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. అందులో భాగంగా జిల్లా పరిషత్ ఛైర్మన్లకు సంబంధించిన రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏ క్షణంలో అయినా జారీ అయ్యే అవకాశ ఉంది. రాష్ట్రంలోని అన్ని 13 జిల్లాల పరిషత్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టం 1994 సెక్షన్‌ 181, సబ్‌ సెక్షన్‌ 2 ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. మొత్తం 13 జిల్లాలకు గాను మహిళలకు ఏడు స్థానాలు (రెండు బీసీ) రిజర్వు కాగా, నాలుగు స్థానాలు జనరల్‌, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒక స్థానం చొప్పున రిజర్వు చేయబడ్డాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లాల వారిగా రిజర్వేషన్లు...

1 ) అనంతపురం : బీసీ మహిళ

2) చిత్తూరు : జనరల్‌

3) తూర్పుగోదావరి : ఎస్సీ

4) గుంటూరు : ఎస్సీ మహిళ

5) కృష్ణా : జనరల్‌ మహిళ

6) కర్నూలు : జనరల్‌

7) ప్రకాశం : జనరల్‌ మహిళ

8) నెల్లూరు : జనరల్‌ మహిళ

9) శ్రీకాకుళం : బీసీ మహిళ

10) విశాఖపట్నం : ఎస్టీ మహిళ

11) విజయనగరం : జనరల్‌

12: పశ్చిమ గోదావరి : బీసీ

13) కడప : జనరల్‌

Next Story
Share it