Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు అప్పుడు ఏమి మాట్లాడారో గుర్తులేదా?

చంద్రబాబు అప్పుడు ఏమి మాట్లాడారో గుర్తులేదా?
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి తీరుపై ఏపీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తి చంద్రబాబు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్నికల సంఘం ఉన్నతాధికారులపై.. ఏం మాట్లాడారో గుర్తుచేసుకోవాలని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిని కూడా అంతు చూస్తానని బెదిరించారన్నారు. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలని.. అధికారంలో ఉన్నప్పుడు కళ్లు తలకెక్కి మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు సూక్తులు చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగినట్లుగా ఎన్నికల కమిషనర్‌ తీరు ఉందని విమర్శించారు.

ఎన్నికలు వాయిదా వేస్తారని టీవీ5, ఆంధ్రజ్యోతి ముందే చెప్పామంటున్నాయి.. ఎవరికీ అంచనా లేని అంశం ఆ మీడియాకు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. రాజ్యాంగానికి లోబడే ఎన్నికల కమిషనర్‌ ప్రవర్తించాలన్నారు. విచక్షణాధికారాన్ని ధర్మబద్ధంగా వాడనప్పుడు విలువ ఇవ్వరన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించకుండానే నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. మీడియాను నిర్వీర్యం చేసిన ఘనత కూడా చంద్రబాబుదేనన్నారు. వైఎస్‌ జగన్‌ పాలనపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధమని పేర్ని నాని సవాల్‌ విసిరారు.

Next Story
Share it