Telugu Gateway
Andhra Pradesh

ఏపీలో ధియేటర్లు..మాల్స్ బంద్

ఏపీలో ధియేటర్లు..మాల్స్ బంద్
X

ఏపీ సర్కారు కరోనా నియంత్రణ చర్యల వేగం పెంచింది. తొలుత స్కూళ్ళకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..తాజాగా ధియేటర్లు, మాల్స్ ను కూడా బంద్ చేయాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ధియేటర్లు, మాల్స్ తోపాటు స్విమ్మింగ్‌ పూల్స్‌, జిమ్‌ సెంటర్లు, ఇండోర్‌ అమ్యూజ్‌మెంట్‌ పార్కులు కూడా మూసివేయాలని ఆదేశించారు. పెద్ద దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు కొనసాగిస్తూ దర్శనాలు నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నారు. కరోనాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసున్నారు. వైద్య పరంగా తీసుకోవాల్సిన చర్యలపై నిపుణులైన వైద్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.

ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి కానీ..భయన్ని కాదని ఈ సందర్భంగా సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. పెద్ద సంఖ్యలో గుమిగూడే జాతరలు మానుకుంటే మంచిదని, శుభకార్యాలు వీలైనంత తక్కువ మందితో నిర్వహించాలని కోరారు. ప్రజారవాణాలో ఉన్న వాహనాలు శుభ్రతను పాటించాలన్నారు. ఎక్కువ మందిని బస్సులో ఎక్కించుకోవద్దని సూచించారు. మార్చి 31 వరకు ఈ నిర్ణయాలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. సీఎం సమావేశం తర్వాత ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నిరోధక చర్యలతోనే రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందని అన్నారు. వీలైతే పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని కోరారు. తప్పనిసరి అయితే తక్కువ మందితో ఫంక్షన్లు జరుపుకోవాలన్నారు.

Next Story
Share it