Telugu Gateway
Andhra Pradesh

కరోనా కొరియాలో స్టార్ట్ అయింది అంట!.

కరోనా కొరియాలో స్టార్ట్ అయింది అంట!.
X

సీఎం జగన్ వ్యాఖ్యల కలకలం

కరోనా వైరస్. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ ఎక్కడ పుట్టిందో అందరికీ తెలుసు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా మీడియా అంతటా ఇదే వార్త. చివరికి చిన్న పిల్లలను అడిగినా కూడా కరోనా తొలి కేసు ఎక్కడ పుట్టిందో చెప్పేస్తారు. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం నాటి విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కేవలం ఒకే ఒక్కడు..సౌత్ కొరియాలో ఒక్కడికి వచ్చింది. ఆడ నుంచి ప్రపంచం అంతా ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. సో ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది.ఒక్కడి నుంచి ఎలా ఎలా పోతా ఉన్నది అన్నదీ ఈ రోజుకు కూడా మనం కథ కథలుగా చూసుకుంటున్నాం.

సూపర్ కారియర్ అని రకరకాలుగా ఈ పొద్దుటికి కూడా చెబుతూ ఉన్నాం.’ అని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత జగన్ కొరియానా?. చైనా?. అంటూ ప్రశ్నించారు. ఈ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరోనా వైరస్ తొలుత చైనాలో బయటపడిన విషయం తెలిసిందే. అందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా వైరస్ ను ‘చైనా వైరస్’ అని సంభోదిస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it