Telugu Gateway
Telangana

అమృతను అడ్డుకున్న బంధువులు

అమృతను అడ్డుకున్న బంధువులు
X

మిర్యాలగూడలో సోమవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మారుతిరావు అంత్యక్రియల సందర్భంగా ఆయన కూతురు అమృత నివాసం వద్ద భద్రత పెంచారు. తన తండ్రి మృత దేహన్ని చూసేందుకు తనకు పోలీసు భద్రత కావాలని అమృత కోరగా..అందుకు పోలీసులు అంగీకరించారు. ఆమెను భద్రత మధ్య మిర్యాలగూడలో స్మశానవాటికకు తీసుకెళ్ళిన బంధువుల నిరసనలతో అమృత చివరి చూపుకు నోచుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. అమృతను తండ్రి మృత చూడటానికి మారుతిరావు బంధువులు అంగీకరించలేదు. మారుతిరావు మరణవార్త తెలిసిన తర్వాత అమృత స్పందించిన తీరు కూడా ఒకింత విమర్శలకు కారణమైంది. ఈ తరుణంలో ఆమె స్మశాన వాటికకు రావటంతో మారుతీరావు బంధువులు, స్థానికులు ‘అమృత గో బ్యాక్‌’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రణయ్‌ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృత.. వాహనం దిగి తండ్రి భౌతికకాయం వద్దకు వెళ్తున్న క్రమంలో.. ఆమెకు వ్యతిరేకంగా స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువులు నినాదాలు చేశారు. తండ్రి చావుకు కారణమైన ‘అమృత గో బ్యాక్‌’, ‘మారుతీరావ్‌ అమర్‌ రహే’ అంటూ అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సాయంతో ఆమె తిరిగి వాహనం ఎక్కి కూర్చున్నారు. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మారుతీరావు శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆదివారం ఉదయం ఆయన విగతజీవిగా కనిపించారు. తన కూతురును కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతో.. ప్రణయ్‌ అనే దలిత యువకుడిని మారుతీరావు హత్య చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా మారుతీరావు మృతికి సంబంధించిన పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక అంశాలు బయటకు వచ్చాయి. మారుతీరావు ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని... విషం కలిపిన గారెలు తిన్న కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. విషం కారణంగా రక్త ప్రసరణ ఆగిపోయి శరీరంలోని అవయవాలన్నీ పనిచేయకుండా ఆగిపోయాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో బ్రెయిన్‌ డెడ్‌ అయి.. ఆ తర్వాత గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. మారుతీరావు తిన్న గారెల్లో విషం కలిసినందువల్లే శరీరం రంగు మారిందని పేర్కొన్నారు.

Next Story
Share it