అల్లు అర్జున్ విరాళం 1.25 కోట్లు
కరోనాపై పోరుకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 1.25 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని తెలంగాణ, ఏపీతో పాటు కేరళకు కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. ఎందుకంటే కేరళలో కూడా అల్లు అర్జున్ కు మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఈ హీరో తెలంగాణ, ఏపీతోపాటు కేరళకు కూడా సాయం ప్రకటించారు. విరాళం ప్రకటించటంతోపాటు ప్రజలందరూ పరిశుభ్రతను పాటిస్తూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెలంగాణ, ఏపీల కోసం పది లక్షల రూపాయలు విరాళంగా అందించనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే రామ్ చరణ్ 70 లక్షల రూపాయలు, ఎన్టీఆర్ 75 లక్షల రూపాయలు కరోనాపై పోరుకు ప్రకటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో అందరి కంటే ఎక్కువగా హీరో ప్రభాస్ నాలుగు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. అయితే ఆయన తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు, ప్రధాని నరేంద్రమోడీ సహాయ నిధికి మూడు కోట్ల రూపాయలు విరాళంగా అందించనున్నట్లు తెలిపారు.