Telugu Gateway
Cinema

సోలో బతుకే సో బెటర్ థీమ్ వీడియో రిలీజ్

సోలో బతుకే సో బెటర్ థీమ్ వీడియో రిలీజ్
X

ఓ వైపు అటల్ బిహరి వాజ్ పేయి.మరో వైపు అబ్దుల్ కలాం. మదర్ థెరిసా, మరో పక్కన ఆర్ నారాయణ మూర్తి కటౌట్ లు. ఇవన్నీ ఎక్కడ అంటారా?. సోలో బతుకే సో బెటర్ సినిమాకు సంబంధించిన థీమ్ వీడియోను విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్, నబా నటేష్ నటిస్తున్నారు. ‘కష్టం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్‌ .

అలాగే ప్రేమ అనేది కూడా ఓ పీలింగే కదా.. మారదని గ్యారెంటీ ఏంటి?’ అంటూ సాయితేజ్‌ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమై.. ‘సోలో సోదర సోదరీమణులారా.. ఈ వేలెంటైన్స్‌ వీకెండ్‌ని మనం అంతా కలిపి జరుపుకుందాం.. మన నినాదం ఒకటే.. సోలో బ్రతుకే సో బెటర్‌’ అంటూ చివరి పంచ్‌తో ముగుస్తుంది. ఈ సినిమా వేసవి కానుకగా మే1న విడుదల కానుంది.

https://www.youtube.com/watch?v=KXVMfkyepFQ

Next Story
Share it