Telugu Gateway
Cinema

‘రెడ్’ మూవీ టీజర్ వచ్చేసింది

‘రెడ్’ మూవీ టీజర్ వచ్చేసింది
X

రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘రెడ్’ మూవీ సినిమా టీజర్ ను శుక్రవారం నాడు విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకరిది ఫుల్ మాస్ లుక్ అయితే..మరొకరిది ఫుల్ క్లాస్ లుక్. ఈ సినిమాలో హీరోయిన్లుగా నివేదా పేతురాజ్, మాళవిక శర్మ నటిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి.. దీనికి కారణం రామ్ తాజా సినిమా ఇస్మార్ట్ శంకర్ మంచి ఫలితాన్ని రాబట్టింది.

ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. టీజర్ ప్రారంభంలో క్లాస్ లుక్ రామ్..తర్వాత మాస్ లుక్ రామ్ లు ఎంటర్ అవుతారు. సిద్ధార్ధ్, ఆదిత్య పాత్రలు పోషిస్తున్న వీరిద్దరూ ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా వ్యవహరిస్తారు. ఈ సినిమా పోలీసు అధికారిగా నటిస్తున్న నివేదా పేతురాజ్ కు స్టేషన్ ల్ కన్నుగీటే సీన్ టీజర్ లో హైలెట్ గా నిలుస్తుంది.

https://www.youtube.com/watch?v=n1gkahx6Xlg

Next Story
Share it