Telugu Gateway
Cinema

ప్రభాస్ తో వైజయంతీ మూవీస్ సినిమా

ప్రభాస్ తో వైజయంతీ మూవీస్ సినిమా
X

వైజయంతీ మూవీస్ భారీ ప్రాజెక్టుకు రెడీ అయింది. ‘మహానటి’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ అందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ తో కొత్త సినిమాను ప్రకటించింది. ప్రభాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంబంధించిన విషయాన్ని ఓ వీడియో రూపంలో వైజయంతీ మూవీస్ విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టడం ఎంతో సంతోషంగా ఉందని ప్రకటించారు.

త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని విషయాలు బహిర్గతం కానున్నాయి. సాహో మూవీ తర్వాత ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డె నటిస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ సినిమా..అందులో నాగ్ అశ్విన్ డైరక్టర్ అంటే ఈ ప్రాజెక్టుకు మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

Next Story
Share it