జగన్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి
BY Telugu Gateway1 Feb 2020 9:45 PM IST

X
Telugu Gateway1 Feb 2020 9:45 PM IST
కేంద్ర బడ్జెట్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. వ్యవసాయంతోపాటు పలు రంగాలకు బడ్జెట్ లో ఎంతో మెరుగైన కేటాయింపులు చేశారన్నారు. బలమైన ఆర్థిక ప్రగతి సాధించే దిశగా కేంద్ర బడ్జెట్ ఉందని జనసేనాని పేర్కొన్నారు. నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు అండగా బడ్జెట్‌లో కేటాయింపులున్నాయని తెలిపారు. రైతులు, యువతకు మేలు చేసేలా బడ్జెట్ ఉందని కొనియాడారు.
రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తేవడంలో వైసీపీ విఫలమైందని ఆరోపించారు. రాజధాని తరలింపు, కూల్చివేతలపై పెట్టిన శ్రద్ధ బడ్జెట్ కేటాయింపులపై పెడితే బాగుండేదని దుయ్యబట్టారు. ఏపీకి నిధులు రాకపోవడమంటే వైసీపీ వైఫల్యమేనని చెప్పారు. వైసీపీ ఇప్పటికైనా కళ్లు తెరవాలని పవన్ సూచించారు.
Next Story