Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ అభిమానులకు సూపర్ న్యూస్

ఎన్టీఆర్ అభిమానులకు సూపర్ న్యూస్
X

ఎన్టీఆర్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. వీళ్ళిద్దరూ కలసి చేసిన తొలి సినిమా ‘అరవింద వీరసమేత రాఘవ’ సూపర్ హిట్ అయింది. దీంతో మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ మధ్యే అల్లు అర్జున్ తో కలసి త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అల వైకుంఠపురములో’ సూపర్ హిట్ కావటంతో ఎన్టీఆర్ కొత్త సినిమాపై క్రేజ్ ఓ రేంజ్ లో పెరగనుంది. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల కొత్త సినిమాను చిత్ర యూనిట్ బుధవారం నాడు అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను హారికా అండ్ హాసిని క్రియేషన్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే అభిమానులు ఇప్పటికే ఓ టైటిల్ ను ప్రచారంలోకి తెచ్చారు. అదే ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అని ప్రచారంలోకి తెచ్చారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు..కీలక పాత్రదారుల వివరాలు తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.

Next Story
Share it