Telugu Gateway
Politics

ఈ దేశం వికశిస్తున్న కమలం

ఈ దేశం వికశిస్తున్న కమలం
X

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పలు అంశాలను సృశించారు. ఈ దేశం వికశిస్తున్న కమలం అంటూ వ్యాఖ్యానించారు. దాల్ సరస్సులో షాలిమార్ తోట వంటిదని పేర్కొన్నారు. నా దేశం సైనికుల నరాలలో ప్రవహిస్తున్న ఉడుకు రక్తం వంటిదని నిర్మలా సీతారామన్ అంటూ కాశ్మీరి కవితను చదివి వినిపించారు. 2020-21 బడ్జెట్ ను ప్రవేశపెడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది సామాన్యుల బడ్జెట్ అని అభివర్ణించారు. దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో బడ్జెట్ ను తీసుకొచ్చామని, జాతి నిర్మాణంలో యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పాత్ర కీలకమైనదని ఆమె అన్నారు. ఎన్నికల్లో ప్రజలు మోదీ నాయకత్వానికి భారీ మెజార్టీతో అధికారం అప్పగించారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో పునరుత్తేజంతో మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధికి పనిచేస్తున్నామని ఆమె చెప్పారు. ఇది ఆదాయాల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్‌. యువతను మరింత శక్తిమంతం చేసే దిశగా ప్రభుత్వ ప్రాధమ్యాలు ఉంటాయి. సమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా చర్యలు. ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయి, ద్రవ్యోల్బణం అదుపులో ఉంది.

నిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకెళ్తుంది. జీఎస్టీ ప్రవేశపెట్టాక దేశవ్యాప్తంగా పన్ను విధానంలో పారదర్శకత నెలకొని ఉంది. చెక్‌పోస్టుల విధానానికి చెక్‌ పెట్టి కొత్త ఆర్థిక వ్యవస్థకు నాంది పలికాం. జీఎస్టీలోని సమస్యల పరిష్కారానికి జీఎస్టీ కౌన్సిల్‌ వేగంగా పనిచేస్తోంది. కొత్తగా 60 లక్షలమంది ఆదాయపన్ను చెల్లింపుదారులు చేరారు. 40 లక్షలమంది కొత్తగా ఐటీ రిటర్న్‌ లు దాఖలు చేశారు. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ సబ్‌కా విశ్వాస్‌ ఈ ప్రభుత్వ లక్ష్యం. ప్రభుత్వం ఖర్చుచేసే ప్రతి రూపాయి నిరుపేదలకు నేరుగా అందించే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.

Next Story
Share it