Telugu Gateway
Cinema

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’గా అఖిల్

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’గా అఖిల్
X

అక్కినేని అఖిల్ కు లక్ కలసి రావటం లేదు. ఇప్పటి వరకూ ఈ హీరో చేసిన సినిమా ఏదీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోలేదు. అయినా ఈ కుర్ర హీరో తన వంతు ప్రయత్నాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ మూవీతో రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని బొమ్మ‌‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోంది.

ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అఖిల్, పూజా హెగ్డే మ‌ధ్య న‌డిచే కెమిస్ట్రీ ఈ సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌బోతుందని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. హైద‌రాబాద్, అమెరికా త‌దిత‌ర ప్రాంతాల్లో ఇప్పటికే షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్ర యూనిట్ అదే ఉత్సాహాంతో.. ఫిబ్ర‌వ‌రి 15 నుంచి మ‌రో షెడ్యూల్ మొద‌లెట్ట‌బోతున్నారు. ఈ షెడ్యూల్‌లో మేజ‌ర్ టాకీ పార్ట్ పూర్తిచేస్తున్న‌ట్లుగా చిత్ర యూనిట్ తెలిపారు.

Next Story
Share it