Telugu Gateway
Cinema

కీర్తిసురేష్ మిస్ ఇండియా ‘సాంగ్’ విడుదల

కీర్తిసురేష్ మిస్ ఇండియా ‘సాంగ్’ విడుదల
X

కీర్తి సురేష్ నటిస్తున్న చిత్రం ‘మిస్ ఇండియా’. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లిరికల్‌ పాటను చిత్ర యూనిట్‌ శుక్రవారం నాడు రిలీజ్‌ చేసింది. కొత్తగా కొత్తగా రంగులే నింగిలో పొంగె సారంగమై అంటూ సాగే ఈ పాటను శ్రేయా ఘోషల్‌ పాడారు. కళ్యాణ్‌ చక్రవర్తి లిరిక్స్‌ రాయగా.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను మార్చి 6న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. మహిళా ప్రాధాన్యత కలిగిన ఈ మిస్ ఇండియా మూవీలో నవీన్‌ చంద్ర, జగపతిబాబు, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ద్వారా నరేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

https://www.youtube.com/watch?v=7wg-YKWDL6g

Next Story
Share it