Telugu Gateway
Cinema

కాజల్ తో ఫోటో దిగిన ‘కాజల్’

కాజల్ తో ఫోటో దిగిన ‘కాజల్’
X

ఒకరు ఒరిజినల్ కాజల్. మరొకరు కాజల్ మైనపు బొమ్మ. బొమ్మ పక్క నిలుచుని అసలు కాజల్ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఒక్క కాజలే కాదు..ఆమె చెల్లి..ఇతర కుటుంబ సభ్యులు కూడా ఆ వేడుకలో పాల్గొన్నారు. ఇదంతా ఎక్కడ అంటారా?. సింగపూర్ లోని మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో. దీనికి సంబంధించిన ఫొటోలను కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌​ సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాజల్ టాలీవుడ్ లో దశాబ్దానికి పైగా హంగామా చేసిన హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికీ ఆమె ఇంకా పలు సినిమాల్లో నటిస్తూనే ఉంది. తెలుగులోనే కాకుండా పలు దక్షిణాది సినిమాల్లో ఆమె ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా నిలిచారు. సింగపూర్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖల విగ్రహాలు కొలువుదీరిన సంగతి తెలిసిందే. దివంగత తార శ్రీదేవి, అనుష్క శర్మ, కరణ్‌ జోహార్‌ సహా టాలీవుడ్‌ హీరోలు ప్రభాస్‌, మహేష్‌ బాబు విగ్రహాలను మేడమ్‌ టుస్సాడ్స్‌ రూపొందించింది. దక్షిణాది నుంచి ఈ గౌరవం దక్కించుకున్న తొలి హీరోయిన్‌గా కాజల్‌ రికార్డుకెక్కారు.

Next Story
Share it