Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ దగ్గర దొరికింది 2.63 లక్షలేనా?

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ దగ్గర దొరికింది 2.63 లక్షలేనా?
X

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పీఎస్ దగ్గర ఐటి దాడుల్లో దొరికిన నగదు 2.63 లక్షల రూపాయలేనా?. అంటే ఔననే చెబుతున్నాయి టీడీపీ. టీడీపీ వర్గాలు. ఐటి అధికారుల పంచనామా పత్రాలను సోషల్ మీడియాలో పెట్టారు. టీడీపీ సానుభూతి పరులు వీటిని వైరల్ చేస్తున్నారు. ఈ పత్రాల ప్రకారం కేవలం పి. శ్రీనివాసరావు దగ్గర నగదు 2.63 రూపాయలు, 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు ఉంది. గత కొన్ని రోజులుగా ఏకంగా చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లోనే రెండు వేల కోట్ల రూపాయల లెక్క చూపని లావాదేవీలు వెలుగులోకి వచ్చాయని ప్రచారం జరుగుతోంది.. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ మారింది. వైసీపీ నేతలు, మంత్రులు అయితే చంద్రబాబు పీఎస్ దగ్గరే అంత దొరికితే..చంద్రబాబు, లోకేష్ ల దగ్గర అయితే ఎంత దొరుకుతుందో అంటూ విమర్శల ప్రారంభించారు.

ఈ తరుణంలో టీడీపీ వర్గాలు ఆదివారం నాడు ఈ పంచనామా నివేదికలను బహిర్గతం చేశాయి. అయితే శ్రీనివాస్ దగ్గర కంటే మూడు ఇన్ ఫ్రా కంపెనీల్లో జరిగిన లావాదేవీలే అత్యంత కీలకం కానున్నాయి. ఆ కంపెనీలు ఉనికిలో లేని సంస్థలకు సబ్ కాంట్రాక్ట్ లు, ఎన్నో బోగస్ లావాదేవీలు వెలుగుచూశాయి. అవి ఎవరి కోసం..ఎవరు చేశారు అన్నదే అత్యంత కీలకం కానుంది. మరి ఏది నిజమో..ఏది అవాస్తవమో తేలాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. కాకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం రాజకీయ ఫైటింగ్ మాత్రం నిరంతరాయమే అని చెప్పొచ్చు.

Next Story
Share it