టీడీపీ నేత ఇంటిపై ఐటి దాడులు
BY Telugu Gateway6 Feb 2020 10:24 AM IST

X
Telugu Gateway6 Feb 2020 10:24 AM IST
ఏపీలో మళ్ళీ ఐటి దాడుల కలకలం. తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి ఇంటిపై పది మందితో కూడిన ఐటీ అధికారుల టీమ్ ఈ దాడులు ప్రారంభించింది. శ్రీనివాసుల రెడ్డి ఇంట్లోని పలు రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఆయన వ్యాపారాలకు సంబంధించిన అంశంపై ఈ దాడులు జరిగినట్లు సమాచారం.
కంపెనీ ద్వారా వచ్చే ఆధాయం, పన్ను చెల్లింపుల్లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోందని చెబుతున్నారు. గురువారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీనివాసరెడ్డి ఇంటి దగ్గర భారీ ఎత్తున పోలీసులను మొహరించారు.
Next Story