Telugu Gateway
Andhra Pradesh

ఎవరు ఏ మందు తాగాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా?..చంద్రబాబు

ఎవరు ఏ మందు తాగాలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా?..చంద్రబాబు
X

ఏపీ ప్రభుత్వ మద్యం విధానంపై తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరు ఏ మందు తాగాలో కూడా ప్రభుత్వం నిర్ణయిస్తుందా?. ప్రజలకు నచ్చిన మందు తాగే అవకాశం కూడా లేదా? ముడుపులు ఇవ్వని బ్రాండ్ లను షాప్ లలో తీసేస్తారా? బ్రాండ్స్ పై నియంత్రణకు ప్రభుత్వానికి ఎవరు అధికారం ఇచ్చారు అంటూ చంద్రబాబు ప్రశ్నల వర్షం కురిపించారు.

తన ఆలోచన అంతా రాష్ట్రం కోసమే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు సోమవారం నాడు విలేకరుల సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు.మద్యం రేట్లు పెంచి ఏమి సాధించారని, ప్రభుత్వ ఆదాయం కూడా పెరగలేదన్నారు. పక్క రాష్ట్రాల నుంచి మద్యం ఏపీలోకి వస్తోందని..అదే సమయంలో కల్తీ మద్యం కూడా తయారవుతోందని చంద్రబాబు విమర్శించారు.ఏపీలో జగన్మోహన్ రెడ్డి సర్కారు బ్రాండ్లను పరిమితం చేయటం ద్వారా లిక్కర్ కంపెనీల నుంచి భారీ ఎత్తున ముడుపులు దండుకుంటోందని టీడీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది.

Next Story
Share it