Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు సెక్షన్ 151 కింద నోటీసులపై హైకో్ర్టు ఆక్షేపణ

చంద్రబాబుకు సెక్షన్ 151 కింద  నోటీసులపై హైకో్ర్టు ఆక్షేపణ
X

విశాఖపట్నంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని విమానాశ్రంలోనే గంటల తరబడి అడ్డుకున్న వ్యవహారంపై శుక్రవారం నాడు హైకోర్టులో వాదనలు జరిగాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ దీనిపై పిటీషన్ దాఖలు చేయగా.. ఈ అంశాన్ని విచారించిన హైకోర్టు పూర్తి సమాచారంతో అఫిడవిట్లు దాఖలు చేయాలని డీజీపీ, విశాఖపట్నం పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుకు సెక్షన్ 151 కింద నోటీసులు ఇవ్వటాన్ని కోర్టు ఆక్షేపించింది. నేరాలు చేసే ఉద్దేశం ఉన్న వాళ్లను నియంత్రించేందుకు, ముందస్తు అరెస్ట్ చేసేందుకు ఇఛ్చే ఈ నోటీసును ఇఛ్చిన తీరు ఏ మాత్రం సరిగాలేదని కోర్టు వ్యాఖ్యానించింది.

ప్రజాస్వామ్య దేశంలోఎక్కడైనా ఇలా చేస్తారా ? అంటూ ప్రశ్నించింది. విశాఖపట్నం విమానాశ్రయం వెలుపల వైసీపీ కార్యకర్తల ను నియంత్రించటంలో పోలీసులు విఫలమయ్యారని శ్రావణ్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ కేసును మార్చి 2కి వాయిదా వేశారు.. భద్రత దృష్టానే చంద్రబాబుకు నోటీసులు ఇఛ్చినట్లు అడ్వకేట్ జనరల్ కోర్టుకు నివేదించారు. గురువారం నాడు నాలుగు గంటల పాటు చంద్రబాబును విశాఖపట్నం విమానాశ్రయం నుంచి బయటకు రాకుండా వైసీపీ శ్రేణులు అడ్డుకున్న విషయం తెలిసిందే. పోలీసులు చివరకు ఆయన్ను విమానాశ్రయం నుంచే హైదరాబాద్ కు తిప్పి పంపారు.

Next Story
Share it